నేడు ఈడీ ముందుకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత
X
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ కు సంబంధించి యంగ్ ఇండియా లిమిటెడ్ కేసులో మరొకసారి విచారణకు హాజరు కానున్నారు. అందుకు బుధవారం (మే 31) ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు అంజన్ కుమార్ బయలుదేరారు. పోయిన ఏడాది నవంబర్ లో ఈడీ ముందు హాజరు కాగా.. ఆయనను ఈడీ మూడు గంటల పాటు విచారించింది.
ఆ విచారణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచర మేరకే యంగ్ ఇండియా లిమిటెడ్ కు విరాళాలు ఇచ్చినట్లు గతేడాది విచారణలో అంజన్ కుమార్ ఈడీ అధికారులకు వెల్లడించారు. ఆ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసిన ఈడీ.. ఇప్పుడు మళ్లీ విచారణకు రావాలనడం గమనార్హం. ఇప్పటికే ఈడీ విచారణలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలను ప్రశ్నించిన విషయం తెలిసిందే.