Home > తెలంగాణ > New Voter Application Last Date: ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం

New Voter Application Last Date: ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం

New Voter Application Last Date: ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం
X

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా తమ ఓటు హక్కు వినియోగించుకోవానుకుంటున్న 18 ఏళ్లు పూర్తయిన వారికి ఇదే ఆఖరి అవకాశం. ఎన్నికల సంఘం కల్పించిన అవకాశం మేరకు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. ఈనెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇప్పటికే తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ కొత్తగా తమ పేరు నమోదు చేసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం యువతకు కల్పించిన అవకాశం చివరికి చేరుకుంది.

2023 అక్టోబరు 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా తన అధికారిక వెబ్‌సైట్‌ (https://voters.eci.gov.in)లో నమోదు చేసుకోవడానికి వీలు కల్పించింది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు బీఎల్‌వోల ద్వారా ఆఫ్‌లైన్‌లో ఫారం-6 అప్లికేషన్లు తీసుకున్న ఎన్నికల సంఘం ఇప్పుడు దాన్ని ఆన్‌లైన్‌కే పరిమితం చేసింది. ఓటరుగా పేరు నమోదు చేసుకునే వారు మీసేవా కేంద్రాలతోపాటు ఓటరు హెల్ప్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఏదైనా సమాచారం తెలుసుకోవడానికి టోల్‌ఫ్రీ 1950 నంబర్‌కు కాల్‌ చేయడానికి వెలుసుబాటును కూడా ఎన్నికల కమిషన్‌ కల్పించింది. కొత్తగా ఓటరు జాబితా పేరు నమోదు చేసుకొనే వారు అలసత్వం వహించొద్దు. 2023 అక్టోబరు 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి. కొత్త ఓటర్ల నమోదుకు అక్టోబరు 31 తో గడువు ముగిస్తుంది. పౌరులుగా ఓటు కలిగి ఉండటం మనందరి హక్కు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

ఓటర్ల నమోదు, ఓటర్ ఐడీలో మార్పుల కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ (https://voters.eci.gov.in)లో అన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఓటర్‌ హెల్ప్‌లైన్‌ యాప్‌ (Voter Helpline)ను మొబైల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌, ఇన్‌స్టాల్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు. మీ స్థానిక బూత్‌ స్థాయి అధికారి (BLO), ఓటరు నమోదు అధికారి (ERO)ని కలసి సమస్య చెబితే, మీరు నింపాల్సిన ఫారాన్ని ఇస్తారు. మీరు కొత్త ఓటర్ అయితే, తాజాగా దిగిన ఫొటో, అడ్రెస్ ప్రూఫ్, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల సర్టిఫికెట్, ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్, కరెంటు బిల్లు డిమాండ్‌ నోటీసు, గ్యాస్‌/బ్యాంక్‌ పాసుపుస్తకాలు వంటి వాటిని సమర్పించాల్సి ఉంటుంది.మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత.. కొన్ని రోజుల్లోనే ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించి, సరిచేస్తారు. ఆ తర్వాత అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తుంది.

Updated : 30 Oct 2023 5:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top