Home > తెలంగాణ > రేపు ఢిల్లీకి షర్మిల.. కాంగ్రెస్లో విలీనంపై తుది దశ చర్చలు..!

రేపు ఢిల్లీకి షర్మిల.. కాంగ్రెస్లో విలీనంపై తుది దశ చర్చలు..!

రేపు ఢిల్లీకి షర్మిల.. కాంగ్రెస్లో విలీనంపై తుది దశ చర్చలు..!
X

కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షర్మిల ఇటు డీకే శివకుమార్తో, అటు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. అయితే ఇంతవరకు ఈ అంశం ఎటూ తేలలేదు. ఈ విలీన ప్రక్రియ ఎందుకు ఆగిందన్నది చర్చనీయాంశంగా మారింది. విలీనం ఉంటుందా లేదా తెలియక వైఎస్సార్టీపీ క్యాడర్ ఆందోళన పడుతోంది. విలీనంపై షర్మిల ఇచ్చిన డెడ్ లైన్ ఇవాళ్టితో ముగుస్తోంది.

ఈ క్రమంలో కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై తుదిదశ చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. షర్మిలతో టీ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చల తర్వాత షర్మిల ఆదివారం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ కాంగ్రెస్ అగ్రనేతలతో తుదిదశలు జరుపుతారు. కాంగ్రెస్ పెద్దలతో చర్చల తర్వాత పార్టీ విలీనంపై క్లారిటీ రానుంది.

ఈ నెల 25 వైఎస్సార్టీపీ కార్యవర్గ సమావేశంలో షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనంపై సెప్టెంబరు 30లోపు నిర్ణయం తీసుకుంటామని షర్మిల చెప్పారు. విలీనం లేకపోతే సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పోటీచేస్తామని స్పష్టం చేశారు. పార్టీ కార్యవర్గం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో విలీనంపై తుదిదశ చర్చలు జరుగుతున్నాయి.


Updated : 30 Sept 2023 4:06 PM IST
Tags:    
Next Story
Share it
Top