Home > తెలంగాణ > New Courts: తెలంగాణలో కొత్తగా 57 కోర్టులు ఏర్పాటు

New Courts: తెలంగాణలో కొత్తగా 57 కోర్టులు ఏర్పాటు

New Courts: తెలంగాణలో కొత్తగా 57 కోర్టులు ఏర్పాటు
X

తెలంగాణలో కొత్త కోర్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 57 కోర్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్లలో ఈ కోర్టులను ఏర్పాటు చేయననున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా కొత్త కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదంతో కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో బాలలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటు చేయనుంది. కొత్త కోర్టుల్లో సిబ్బంది నియామకానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది.

Updated : 7 Oct 2023 10:19 AM IST
Tags:    
Next Story
Share it
Top