Home > తెలంగాణ > 'పల్లెవెలుగు'లో 183 మంది మహిళలు.. టైర్ల నుంచి పొగలు

'పల్లెవెలుగు'లో 183 మంది మహిళలు.. టైర్ల నుంచి పొగలు

పల్లెవెలుగులో 183 మంది మహిళలు.. టైర్ల నుంచి పొగలు
X

ఉచిత ప్రయాణ పథకంతో.. మహిళలు ఇంతకుముందులా ఆటోలను, క్యాబ్‌లను కాకుండా.. ఏ కొద్దిపాటి దూరానికైనా ఆర్టీసీ బస్సులనే తమ ప్రయాణానికి ఎంచుకుంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓ పల్లె వెలుగు బస్సు ఏకంగా 182 మంది మహిళలను ఎక్కించుకుని ప్రయాణించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహబూబ్ నగర్ జిల్లా ధన్వాడలో పల్లె వెలుగు బస్సులో 182 మంది మహిళలు ప్రయాణించారు. దీంతో ఆ బస్సు టైర్ల నుంచి పొగలు వచ్చాయి. అది గుర్తించిన బస్ డ్రైవర్ వెంటనే బస్సును ఆపేశాడు. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన టీఎస్ 06 యూపీ 3411 నంబరు గల పల్లె వెలుగు బస్సు బుధవారం ఉదయం మహబూబ్ నగర్ నుంచి 182 మంది ప్రయాణికులతో నారాయణపేటకు బయలుదేరింది.

జేపీఎన్‌సీఈ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద బస్సు నుంచి దాదాపు 30 నుంచి 40 మంది విద్యార్థులు దిగారు. ఆ తర్వాత మరికొందరు మహిళలు బస్సు ఎక్కాడు. సామర్థ్యానికి మించి జనాలు బస్సు ఎక్కడంతో ఓవర్ లోడ్ అయింది. దీంతో మరికల్ వద్దకు వెళ్లిన తర్వాత వెనుక టైర్ల నుంచి పొగలు రావడం ప్రారంభం అయింది. ఓవర్ లోడ్‌ కారణంగా ధన్వాడ చేరుకోగానే పొగ ఎక్కువై కాలిన వాసన వచ్చింది. దీంతో డ్రైవర్‌ అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ప్రయాణికులందరినీ అక్కడే దించి ఇతర బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు.

Updated : 15 Dec 2023 11:39 AM IST
Tags:    
Next Story
Share it
Top