Home > తెలంగాణ > Auto Drivers Rally : ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం..రేపు భారీ ర్యాలీ

Auto Drivers Rally : ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం..రేపు భారీ ర్యాలీ

Auto Drivers Rally : ఆటో డ్రైవర్ల కీలక నిర్ణయం..రేపు భారీ ర్యాలీ
X

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం వల్ల మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే బస్సుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించడం పట్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేపట్టాలని ఆటో డ్రైవర్లు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నగరంలో రేపు ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు భారీ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ఆటో డ్రైవర్ల బంద్‌పై ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకుంటుందోనని తీవ్ర ఉత్కంఠగా మారింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని కూడా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ జేఏసీ కూడా డిమాండ్ చేసింది.

హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 16న ఆటో డ్రైవర్లతో పాటుగా క్యాబ్, డీసీఎం, లారీల డ్రైవర్లు బంద్ పాటించనున్నారు. ఈ విషయాన్ని ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ జేఏసీ వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి చట్టాన్ని రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

Updated : 15 Feb 2024 4:57 AM GMT
Tags:    
Next Story
Share it
Top