Home > తెలంగాణ > Jagtial : బలగం సీన్ రిపీట్.. మూలుగు బొక్క కోసం లొల్లి.. పెళ్లి రద్దు

Jagtial : బలగం సీన్ రిపీట్.. మూలుగు బొక్క కోసం లొల్లి.. పెళ్లి రద్దు

Jagtial : బలగం సీన్ రిపీట్.. మూలుగు బొక్క కోసం లొల్లి.. పెళ్లి రద్దు
X

బలగం సినిమాలో మూలుగ బొక్క కోసం బావ బామ్మర్దుల మధ్య గొడవ జరుగుతుంది. అప్పట్లో ఈ సీన్ హైలెట్గా నిలిచింది. రియల్ గానూ ఇటువంటి ఘటనే జరిగింది.. అయితే ఇక్కడ బావ బామ్మర్దుల మధ్య గొడవ కాదు ఏకంగా పెళ్లి రద్దవడం గమనార్హం. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెట్‌పల్లి మండలానికి చెందిన అబ్బాయికి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అమ్మాయితో పెళ్లి ఖాయమైంది. కట్నకానుకలు సైతం మాట్లాడుకుని ఎంగేజ్మెంట్ పెట్టుకున్నారు. ఇక్కడే అసలు కథ జరిగింది.

నవంబరు మొదటి వారంలో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా అమ్మాయి ఇంట్లో మాంసాహారంతో భోజనాలు పెట్టారు. ఈ క్రమంలో అబ్బాయి బంధువులు మూలుగ బొక్క కావాలని అడగడంతో మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య లొల్లి మొదలైంది. ఈ గొడవ కాస్త చివరికి పోలీస్‌స్టేషన్‌ వరకు వెళ్లింది. ఆ తర్వాత ఇరువర్గాలు శాంతించినప్పటికీ.. పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. అయితే మూలగ బొక్క కోసం పెళ్లి సంబంధం రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.


Updated : 24 Dec 2023 7:44 AM IST
Tags:    
Next Story
Share it
Top