మరికాసేపట్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి
X
ప్రగతి భవన్ నేటి నుంచి ప్రజా భవన్‌గా మారింది. ఇక ఈ భవనానికి సామాన్యులు ఎవరైనా రావచ్చు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి.. మరోవైపు ప్రగతి భవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచె, గోడ, బారికేడ్లను తొలగించాలని ఆదేశించారు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు బద్దలు కొట్టామని.. శుక్రవారం ఉదయం అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తామని, ప్రగతి భవన్ పేరుని జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ప్రగతి భవన్ గేట్లు ప్రజల కోసం తెరచుకున్నాయి. ఇకపై ఎవరైనా సరే ప్రగతి భవన్‌కి వెళ్లొచ్చు.
ఇవాళ్టి నుంచి ఇక్కడే ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఇందులో లక్షలాదిగా పాల్గొనాల్సిందిగా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ ప్రగతి భవన్‌ని సీఎం కేసీఆర్.. ఎంతో ఇష్టపడి, నచ్చిన డిజైన్, పక్కా వాస్తుతో నిర్మించుకున్నారు. 2017 నవంబర్ 23 నుంచి 2023 డిసెంబర్ 3 వరకూ ఇక్కడి నుంచే పాలన సాగించారు.