సీఎం రేవంత్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరంటే..?
X
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే అధికారుల బదిలీలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్‌రెడ్డిని, సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా వి.శేషాద్రిని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి నియమతులయ్యారు. రానున్న రోజుల్లో మరిన్ని కీలక బాధ్యతల్లో అధికారుల నియామకం జరగనున్నది. ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తామని నూతన ముఖ్యమంత్రి తెలిపారు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం చేసిన రేవంత్ రెడ్డి.. అభయ హస్తం చట్టానికి మార్గం సుగుమం చేస్తూ ఈ సంతకం చేశారు. ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగిని, దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం కల్పిస్తూ రెండో ఫైల్‌పై సంతకం చేయగా అధికారుల బదిలీల ప్రక్రియ మొదలైంది.