Home > తెలంగాణ > ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి అరెస్ట్
X

హైదరాబాద్‌లోని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసులో బాంబు ఉందంటూ ఫేక్‌కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాల్ చేసింది గుంటూరుకు చెందిన జైని రాధాకృష్ణ అనే వ్యక్తి గుర్తించి హయత్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 11వ తేదిన నాంపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆదాయపు పన్ను కార్యాలయంలో బాంబు ఉందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. బాంబు పేలకుండా ఉండాలంటే రూ.కోటి ఇవ్వాలంటూ నిందితుడు డిమాండ్ చేశాడు.





దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఆఫీసులోని సిబ్బందిని బయటకు పంపించి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఫేక్ కాల్ నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి కాల్ చేసిన వ్యక్తి కోసం గాలించారు. చివరికి నిందితుడు హయత్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన జైని రాధాకృష్ణ డబ్బులు వస్తాయనే ఆశతో ఫేక్ కాల్ చేశాడు. హయత్‌నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి డయల్‌ 100కు ఫోన్‌ చేసి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ టవర్స్‌లో బాంబు పెట్టామని బెదిరించాడు.


Updated : 19 Jun 2023 10:03 PM IST
Tags:    
Next Story
Share it
Top