Home > తెలంగాణ > Lasya Nanditha: సీటు బెల్టు ధరించకపోవడంతో లాస్య నందిత మృతి

Lasya Nanditha: సీటు బెల్టు ధరించకపోవడంతో లాస్య నందిత మృతి

Lasya Nanditha: సీటు బెల్టు ధరించకపోవడంతో లాస్య నందిత మృతి
X

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణానికి గల కారణాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఆమె ప్రయాణిస్తున్న కారు అతివేగంతో రెయిలింగ్ ను ఢీకొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కారు ఇంజన్ ముందు భాగం, ముఖ్యంగా కారు ఎడమ వైపు పూర్తిగా నుజ్జనుజ్జయింది. ముందు సీటులో డ్రైవర్ పక్కన కూర్చున్న లాస్య నందిత.. అక్కడికక్కడే సీటులోనే ప్రాణాలు కోల్పోయారు. గురువారం రాత్రి సదాశివపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని విశ్వసనీయ సమాచారం. ఈ ఉదయం మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకుంటుందనగా.. పటాన్ చెరు సమీపంలోని ఓఆర్ఆర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

అయితే కారు నడిపిన వ్యక్తి ఆమె డ్రైవర్ కాదని తెలుస్తోంది. డ్రైవర్ కు బదులుగా ఆమె పీఏ ఆకాశ్ కారు నడిపాడని , ముందు సీటులో కూర్చుని ఉన్న లాస్య నందిత సీటు బెల్టు ధరించలేదని , ఎమ్మెల్యే మృతికి ఇవే కారణాలుగా తెలుస్తున్నాయి. ఎదురుగా ఉన్నా వాహానాన్ని తప్పించబోయి, సడెన్ బ్రేక్ వేశాడని, అందువల్లే కారు రెయిలింగ్ ని ఢీకొట్టిందని సమాచారం. ఎంత అనుభవజ్ఞుడైనా.. డ్రైవర్ కాకుండా పీఏ కారు నడపడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆ సమయంలో డ్రైవర్ మద్యం సేవించి ఉన్నాడా? అతడి బదులు పీఏ డ్రైవ్ చేశాడా? పీఏ నిద్రమత్తు కారణంగానే అతివేగంతో అదుపు తప్పి రెయిలింగ్ ని ఢీకొని ఉంటుందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చాలామంది.

ప్రమాద సమయంలో లాస్య నందిత ప్రయాణించిన కారు మారుతి సుజుకి ఎక్స్ ఎల్ 6 (XL 6) వెహికల్. ఆరుగురు కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ కారులో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, సీట్-బెల్ట్ రిమైండర్, హై-స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సెంట్రల్ లాకింగ్.. ఇలా ఎన్నో సదుపాయాలు ఉంటాయి. ఇవన్నీ ఉన్నా కూడా ప్రమాదం నుంచి ప్రాణాలు కాపాడుకోలేకపోయారు లాస్య నందిత. సడన్ బ్రేక్ వేయడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటుగా వేగంగా ఢీ కొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు చెబుతున్నారు.

Updated : 23 Feb 2024 3:29 AM GMT
Tags:    
Next Story
Share it
Top