Home > తెలంగాణ > రంజాన్ సీజన్ వచ్చేసింది.. హైదరాబాదీలను నోరూరిస్తున్న హలీం

రంజాన్ సీజన్ వచ్చేసింది.. హైదరాబాదీలను నోరూరిస్తున్న హలీం

రంజాన్ సీజన్ వచ్చేసింది.. హైదరాబాదీలను నోరూరిస్తున్న హలీం
X

రంజాన్ సీజన్ వచ్చేసింది. హైదరాబాద్ వాసులకు ఇష్టమైన హలీమ్ సందడి షూరూ అయ్యింది. ప్రతి వీధిలో హలీం సెంటర్లు వెలుస్తున్నాయి. రంజాన్ నెల మొదలు కావడంతో నగర వాసులు హలీం తినడానికి ఆసక్తి చూపుతారు. రూచితో పాటు పౌష్ఠికత కలిగిన ప్రజలు లొట్టలేసుకుంటూ ఆరగిస్తుంటారు. ఈ వంటకాన్ని అరేబియన్స్‌ పరిచయం చేశారు. దీనిని హరీస్‌ అని కూడా పిలుస్తారు. పదో శతాబ్ధంలో కితాబ్‌ అల్‌ తబిక్‌ (వంటల పుస్తకం)లో తొలిసారిగా ఈ విషయాన్ని రాశారు.హైదరాబాద్‌ నిజాం ఆర్మా దగ్గర ఉండే అరేబియన్‌ సైన్యం హలీంను మన దేశంలోకి తీసుకొచ్చింది. హలీంను చికెన్‌, మటన్‌తో తయారు చేస్తారు. తయారీదారులు మండీలు ఏర్పాటు చేసి హలీం తయారు చేయడంపై దృష్టి సారించారు.

రంజాన్ మాసంలో సర్వసాధారణమైన హలీం ఇరాన్ లో పుట్టిన వంటకాన్ని తయారు చేయడానికి ఎనిమిది నుండి తొమ్మిది గంటల సమయం పడుతుంది. పాతబస్తీలోని మదీనా బిల్డింగ్ లో ఉన్న మదీనా హోటల్ యాజమాన్యం దీనిని మొదట నగరానికి పరిచయం చేయగా, క్రమంగా వివిధ రెస్టారెంట్లు రంజాన్ సందర్భంగా దీన్ని తయారు చేయడం ప్రారంభించాయి. చికెన్, మటన్ లేదా నెయ్యి, గోధుమలు, సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్ మరియు ఇతర పదార్ధాలతో హలీమ్ తయారు చేస్తారు. సుమారు 6 నుంచి 8 గంటల వరకు హలీం తయారీకి సమయం పడుతుంది. కేలరీలు అధికంగా ఉండే హలీం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా తక్షణ శక్తినిస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో గల్లీగల్లీన హలీం బట్టీలు కనిపిస్తాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఘుమఘుమలాడుతూ.. పొగలే కక్కు హలీంను తినేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారు. రంజాన్ ఉపవాసముండే ముస్లింలే కాదు.. ఇతర మతస్తులు కూడా ఇష్టంగా ఆరగిస్తారు.

Updated : 11 March 2024 3:14 PM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top