Home > తెలంగాణ > MMTS : ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తి..తీరనున్న ప్రయాణ కష్టాలు..

MMTS : ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తి..తీరనున్న ప్రయాణ కష్టాలు..

MMTS : ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు పూర్తి..తీరనున్న ప్రయాణ కష్టాలు..
X

ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు అన్ని పూర్తయ్యాయి. ముఖ్యంగా సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య ఎంఎంటీఎస్‌ రెండో లైను ప్రయాణికుల కోసం సిద్ధమైంది. డిఫెన్స్, రైల్వే శాఖల మధ్య రెండో లైను నిర్మాణానికి ఉన్న ఇబ్బందులు తొలగడంతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఇందులో భాగంగా మొత్తం 95 కిలోమీటర్ల మేర లైన్లు వేయడం, కరెంట్, స్టేషన్ల నిర్మాణం పూర్తిచేశారు. కాగా మార్చి మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రారంభం కానుంది. అదే రోజు సనత్‌నగర్‌ - మౌలాలి మధ్య మొత్తం 22 కిలోమీటర్ల మేర రెండో దశ ఎంఎంటీఎస్‌ రైళ్లను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌ - ఘట్‌కేసర్‌ లైన్‌ కూడా అదేరోజు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.





మల్కాజిగిరి, అల్వాల్‌ ప్రాంతాల్లో ఉన్న ఐటీ ఉద్యోగులకు మార్గం సుగమం కానుంది. ఎంఎంటీఎస్‌ రెండో దశ మౌలాలి - సనత్‌నగర్‌, హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లి అందుబాటులోకి రానుండటంతో వీరంతా సులువుగా వారి వారి గమ్యస్థానాలకు చేరే అవకాశముంది. దీంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా మౌలాలి నుంచి హైటెక్‌సిటీకి ఎంఎంటీఎస్‌లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు హైటెక్‌సిటీ వైపు ప్రయాణ కష్టాలు తీరుతాయి. మౌలాలి - సనత్‌నగర్‌ మధ్య మొత్తం 22 కి.మీ. మేర 6 స్టేషన్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. వీటి పరిధిలో ఉన్న కాలనీలు, బస్తీలకు కేవలం రూ. 5 టిక్కెట్‌తో వేగవంతమైన ప్రయాణం సాకారం కానుంది.


Updated : 12 Feb 2024 9:27 AM IST
Tags:    
Next Story
Share it
Top