Home > తెలంగాణ > ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా ?

ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా ?

ఫిబ్రవరి 8న సెలవు ప్రకటించిన ప్రభుత్వం..ఎందుకో తెలుసా ?
X

తెలంగాణ ప్రభుత్వం (Telangana Goverment) కీలక ప్రకటన చేసింది. షబ్ -ఎ-మెరాజ్ పండుగ సందర్బంగా ఫిబ్రవరి 8 వ తేదీన విద్యాసంస్థలకు సెలవు మంజురు చేసింది. సర్కారు విడుదల చేసిన క్యాలెండర్‌లో ఈ నెల 8 వ తేదీన ఐచ్చిక సెలవుగా పేర్కొంది. తాజాగా సాధారణ లీవ్‌గా మారుస్తు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అది కాస్త సాధారణ సెలవుగా మారింది. షబ్-ఏ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున ప్రార్థనలను చేసే మసీదులను దీపాలతో అలంకరించి రాత్రి పూట జాగారం చేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లకు సెలవును ప్రకటించనున్నారు. ఫిబ్రవరి నెలలో ఆదివారాలతో పాటు మరికొన్ని ముఖ్యమైన సెలవు దినాలు ఉన్నాయి. ఫిబ్రవరి 14న వసంత పంచమి, సరస్వతి పూజ, ఫిబ్రవరి 19న శివాజీ జయంతి (Shivaji Jayanti) ఫిబ్రవరి 24న గురు రవిదాస్ జయంతి సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఉంటాయి. అయితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఈ పబ్లిక్ హాలిడేస్ ఉండకపోవచ్చు.

ఈ వేడుకలు ఘనంగా జరిగే ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలకు సెలవులు ఉండవచ్చు. ప్రభుత్వ విడుదల చేసిన సెలవుల క్యాలెండర్ (Calendar of Holidays) ప్రకారం మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సెలవు ఉంది. మార్చి 25 హోలీ హాలీ డే ఉంది. మార్చి 29 గుడ్ ఫ్రైడే సందర్భగా సెలవు ఇచ్చారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయింతి సందర్భంగా సెలవు డిక్లెర్ చేశారు. ఏప్రిల్ 9 ఉగాది సెలవు ఉంది. ఏప్రిల్ 11,12న రంజాన్ సెలవు ప్రకటించారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి (Ambedkar Jayanti) సందర్భంగా హాలీడే ఉంది. ఏప్రిల్ 17 శ్రీరామనవమికి కూడా సెలవు ఇచ్చారు. జూన్ 17 బక్రిద్ సెలవు ఉంది. జులై 17న మెహర్రం హాలీడే ఉంది. జులై 29న బోనాల సందర్భంగా సెలవు ప్రకటించారు. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే హాలీ డే ఉంది. ఆగస్ట్ 26 శ్రీకృష్ణ జన్మాష్టమి (Shri Krishna Janmashtami )సందర్భంగా సెలవు ఇచ్చారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి హాలీ డే ఉంది.సెప్టెంబర్ 16 ఇద్ నబీ కి సెలవు ఇచ్చారు. అక్టోబర్ 2న మహత్మ గాంధీ జయంతి సందర్బంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 12, 13 దసరా సెలవులు ఉండనున్నాయి. అక్టోబర్ 31 దీపావళి హాలీ డే ఉంది. నవంబర్ 15 గురు ననాక్ జయింతి సందర్భంగా సెలవు ఉంది. డిసెంబర్ 25, 26 క్రిస్ మస్ సెలవులు ఉన్నాయి.

Updated : 1 Feb 2024 3:46 PM IST
Tags:    
Next Story
Share it
Top