Home > తెలంగాణ > నేడు ఆసిఫాబాద్​కు సీఎం కేసీఆర్.. భారీ బహిరంగ సభ

నేడు ఆసిఫాబాద్​కు సీఎం కేసీఆర్.. భారీ బహిరంగ సభ

పోడు భూమి పట్టాలు పంపిణీ చేయనున్న సీఎం

నేడు ఆసిఫాబాద్​కు సీఎం కేసీఆర్.. భారీ బహిరంగ సభ
X

పోడు భూములను సాగుచేసుకుంటున్న గిరిజన రైతుల కల సాకారమవుతున్నది. నేడు రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన గిరిజన రైతులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలను అందజేయనున్నది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్‌ శుక్రవారం కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పోడు పట్టాలను పంపిణీ చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు అర్హులైన గిరిజనులకు పోడు పట్టాలను అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలు సిద్ధమయ్యాయి. 1,51,146 మంది పోడు రైతులకు పట్టాలు అందనున్నాయి.

పోడు పట్టాల పంపిణీ తర్వాత సీఎం కేసీఆర్... నూతనంగా నిర్మించిన కలెక్టరేట్‌, జిల్లా పోలీస్ కార్యలయం, బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​కుమార్ పోడుపట్టాలు పంపిణీ చేయనున్నారు. మహబూబాబాద్ జిల్లాలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ పోడుపట్టాలు అందిస్తారు.రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారిగా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో పోడు పట్టాల పంపిణీ చేపడతారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాలను కూడా వర్తించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. కొత్తగా పోడు పట్టాలు పొందిన వారి పేరిట ప్రభుత్వమే ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు తెరిచి భూయాజమానులకు రైతుబంధు సాయాన్ని జమచేయనున్నారు.

Updated : 30 Jun 2023 3:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top