Home > తెలంగాణ > TS Assembly : రెండో రోజు అసెంబ్లీ.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ

TS Assembly : రెండో రోజు అసెంబ్లీ.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ

TS Assembly : రెండో రోజు అసెంబ్లీ.. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ
X

తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీ చర్చించనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండగా.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస రెడ్డి బలపరుస్తారు. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు. మండలిలో జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టనుండగా.. మహేష్ కుమార్ గౌడ్ బలపరుస్తారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి కాలరీస్ వార్షిక నివేదిక సహా తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికన ఉభయసభల ముందు ఉంచనున్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉభయసభల ముందు టేబుల్ చేస్తారు. అదేవిధంగా బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సభ ముందు ఉంచనున్నారు. కాగా రేపు సభలో రేవంత్ సర్కార్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఆ తర్వాత బడ్జెట్ పై చర్చ జరగనుంది. ఈ నెల 13న సమావేశాలు ముగియనున్నాయి.

Updated : 9 Feb 2024 9:19 AM IST
Tags:    
Next Story
Share it
Top