Home > తెలంగాణ > రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపై చర్చ

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపై చర్చ

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. వాటిపై చర్చ
X

తెలంగాణ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. నెల రోజుల పాలనతో పాటు ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించనున్నారు. అదేవిధంగా ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై కేబినెట్ చర్చించనుంది. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించే అవకాశముంది. ఈ నెల 31లోపు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తామని రేవంత్ ఓ ఇంటర్వూలో చెప్పారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది రెండో కేబినెట్ సమావేశం.


Updated : 7 Jan 2024 3:45 PM IST
Tags:    
Next Story
Share it
Top