వరుస సెలవులు.. హైదరాబాదీలకు TSRTC గుడ్ న్యూస్
X
ఉద్యోగం, చదువుల నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్న వారికి గుడ్ న్యూస్. రెండవ శనివారం, ఆదివారం, స్వాతంత్ర్యం దినోత్సవం.. ఇలా వరుస సెలవులు రావడంతో సొంత ప్రాంతాలకు లేదంటే విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారికి టీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. అలా సెలవుల్లో ప్లాన్ చేసుకున్న వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. సుదూర ప్రాంతాలైన షిర్దీ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలకు శుక్రవారం, శనివారం ఈ సర్వీసులను నడపనున్నారు. ఈ విషయమై సజ్జనార్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
ప్రయాణికులకు శుభవార్త! వరుస సెలవుల నేపథ్యంలో ఈ రోజు, రేపు సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్…
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) August 11, 2023
‘‘ప్రయాణికులకు శుభవార్త! వరుస సెలవుల నేపథ్యంలో ఈ రోజు (శుక్రవారం), రేపు(శనివారం) సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను #TSRTC ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి చెన్నై, షిర్దీ, విశాఖపట్నం, కాకినాడ, అమలాపురం, తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక సర్వీసులను సంస్థ నడుపుతోంది. ప్రయాణికులు అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in లో టికెట్లను బుకింగ్ చేసుకోగలరు. పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించగలరు’’ అని సజ్జనార్ ట్వీట్ చేశారు.