అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లోకి చొరబడిన దుండగుడు..విద్యార్థనుల ఆందోళన
X
సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హస్టల్‌లో ఆగంతుడు అలజడి సృష్టించాడు. బాత్రూం కిటికీ పగలకొట్టి లోపలికి చొరబడి విద్యార్ధులపై దాడికి ప్రత్నించారు. అమ్మాయిలు ప్రమత్తమై దుండగుడు పట్టుకోని చున్నీతో కట్టేసి పోలీసులకు అప్పగించారు. మొత్తం ముగ్గురు యువకులు లోపలికి చొరబడినట్టు విద్యార్థినులు చెబుతున్నారు. ఆగంతుడు తమను కొట్టి పారిపోయేందుకు ప్రయత్నించాడని విద్యార్థులు తెలిపారు. హాస్టల్‌లో తమకు రక్షణ కరువైందని, వెంటనే సీసీ టీవీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. మరోవైపు పీజీ లేడీస్ హస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
వీసీ వచ్చి భద్రతపై హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హాస్టల్‌కు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకొని వాహనంలో ఎక్కించి తీసుకెళ్తుండగా స్టూడెంట్స్ అడ్డుకున్నారు.తమకు న్యాయం జరిగే వరుకు తీసుకెళ్లొద్దంటు పట్టుబట్టారు. మొన్న ఉస్మానియ లేడిస్ హస్టల్‌లో దుండగుడు చొరబడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఉమెన్స్ హాస్టల్‌లో సెక్యూరీటీపై సర్వాత్ర విమర్శలు వెలువెత్తున్నాయి.