కేసీఆర్‌కు ఇష్టమైన ఆలయంలో దొంగలు పడ్డారు...
X
సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం కొనాయిపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గుడిలోని హుండీని ఎత్తుకెళ్లారు.అర్ధరాత్రి సమయంలో ఈ దొంగతనం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఆదారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. మరికొన్ని ఆలయాల్లో కూడా చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
కేసీఆర్‌కు ఈ ఆలయం అత్యంత ఇష్టమైనది. ఏ పని మొదలు పెట్టిన కూడా ఇక్కడ పూజలు చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది. గతంలో ఈ ఆలయంలో పూజలు చేసిన తర్వాతనే నామినేషన్ దాఖలు చేసేవారు. తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఈ ఆలయంలో పూజలు చేసి వెళ్ళారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కేసీఆర్ పలుమార్లు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావుకు కూడా ఈ ఆలయం అత్యంత సెంటిమెంట్. ప్రతి ఎన్నికలప్పుడు ఇక్కడ నామినేషన్ పత్రాలకు పూజలు చేయించడం కొనసాగిస్తున్నారు. అలాంటి దేవాలయంలో దొంగలు పడడం చర్చనీయాంశమైంది.