Home > తెలంగాణ > నైటీలో వచ్చి 37 ఫోన్లు కొట్టేశాడు..కట్‌చేస్తే

నైటీలో వచ్చి 37 ఫోన్లు కొట్టేశాడు..కట్‌చేస్తే

నైటీలో వచ్చి 37 ఫోన్లు కొట్టేశాడు..కట్‌చేస్తే
X

పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు కొందరు దొంగలు అతి తెలివితేటలు ఉపయోగిస్తారు.ఉన్న అరకొర జ్ఞానంతో పోలీసులును పక్కదారి పట్టించొచ్చనే భావనతో చోరీ చేస్తారు. ఆ తర్వాత అడ్డంగా దొరికిపోయి కటకటాలు లెక్కబెడతారు. తాజాగా హైదరాబాద్‌లో ఇదే జరిగింది. తనను ఎవరూ గుర్తుపట్టకూడదని ఓ దొంగలో నైటీలో చోరీకి వెళ్లాడు. అనుకున్నవన్నీ పక్కాగా అమలు చేసి ఓ మొబైల్ షాప్‌లో 37 ఫోన్లను కొట్టేశాడు. అయితే చివరికి రెండు రోజుల్లోనే పోలీసులకు దొరికేశాడు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లెకు చెందిన మంకాల యాకయ్య అలియాస్‌ వినయ్‌ ఐదు ఏళ్ల క్రితం ఉపాధి కోసం నగరానికి వచ్చాడు. ప్రస్తుతం ఎమరాల్డ్‌ హౌస్‌లో నైట్‌ సెక్యూరిటీగార్డ్‌గా పనిచేస్తున్నాడు. అంతకుముందు అదే బిల్డింగ్‌లో ఉన్న రియల్‌ మీ మొబైల్‌ షోరూమ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేశాడు. దీంతో ఆ మొబైల్ షాపులో సీసీ కెమెరాలు పనిచేయవని తెలుసుకున్న అతడు అందులో చోరీ చేయాలని భావించాడు. ఇందుకోసం ముందుగానే ప్లాన్ వేసుకున్నాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు సొంతూరుకు వెళ్తున్నట్టు సెలవు పెట్టాడు.అనంతరం పక్కా ప్లాన్‌తో మే 28వ తేదీ రాత్రి 12.30 గంటలకు అతని సోదరి నైటీని ధరించి దుకాణం వద్దకు వెళ్లాడు. షట్టర్‌ తాళం పగులగొట్టి లోపలికి చోరీ చేశాడు.మొత్తం రూ.8.28లక్షల విలువైన 37 రియల్‌ మీ ఫోన్లు, ఒక ట్యాబ్‌ను ఎత్తుకెళ్లిపోయాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. మొదటి నైటీలో ఓ మహిళ దొంగతనం చేసినట్లు భావించారు. అనంతరం నైటీలో ఉన్నది వినయ్‌‌గా గుర్తించి అతడి సొంత గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. మడిపల్లెలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అక్కడే దాచిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Updated : 31 May 2023 1:33 PM GMT
Tags:    
Next Story
Share it
Top