Home > తెలంగాణ > ఈ ఓటర్లు అందరికీ ఆదర్శం..ఆక్సిజన్‌ సిలిండర్‌తో వెళ్లి మరీ..

ఈ ఓటర్లు అందరికీ ఆదర్శం..ఆక్సిజన్‌ సిలిండర్‌తో వెళ్లి మరీ..

ఈ ఓటర్లు అందరికీ ఆదర్శం..ఆక్సిజన్‌ సిలిండర్‌తో వెళ్లి మరీ..
X

తెలంగాణ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. యువత, మహిళలతో పాటు సీనియర్ సిటిజన్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు సైతం తమ హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఓటు వేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉంటున్న 75 ఏళ్ల శేషయ్య లివర్‌ సిరోసిస్‌ వ్యాధితో బాధపడుతున్నారు. అయినప్పటికీ ఓటు వేయాలనే ధృడసంకల్పంతో ఆక్సిజన్ సిలిండర్‌తో సహా ఆయన గచ్చిబౌలిలోని పోలింగ్‌ బూత్‎కి వచ్చి తన ఓటు వేశారు. ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. 1966 నుంచి తాను మరిచిపోకుండా ఓటు ఓటు వేస్తున్నానని ఇప్పుడు అదే పని చేశానని తెలిపారు. ఇక మరోవైపు ముషీరాబాద్‌‏లోని ఎస్‎బీఐ కాలనీలో నివసిస్తున్న ఆస్తమా పేషెంట్ లక్ష్మీ శ్యాంసుందర్‌ ఘంటసాల గ్రౌండ్‌లోని 83వ పోలింగ్‌ బూత్‎లో ఓటు వేశారు. వీరితో పాటు ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య 99 ఏళ్ల వయసులో కూడా వీల్ చెయిర్‎లో పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలిచారు.

Updated : 30 Nov 2023 1:21 PM IST
Tags:    
Next Story
Share it
Top