Home > తెలంగాణ > ఎన్నికల వేళ.. కొత్త వైన్ షాప్లకు ఫుల్ డిమాండ్

ఎన్నికల వేళ.. కొత్త వైన్ షాప్లకు ఫుల్ డిమాండ్

ఎన్నికల వేళ.. కొత్త వైన్ షాప్లకు ఫుల్ డిమాండ్
X

తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్స్ల జారీకి ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న 2,620 మద్యం దుకాణాల లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగుస్తుండటంతో.. కొత్త లైసెన్సుదారుల ఎంపికకు సంబంధించి ఎక్సైజ్ శాఖ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబర్ నుంచి మద్యం షాపుల ఏర్పాటుకు కొత్త లైసెన్స్లను లాటరీ ద్వారా మంజూరు చేస్తారు. ఈ నెల 3న జిల్లాల వారీగా ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఆగస్ట్ 21న డ్రా ద్వారా మద్యం షాపుల లైసెన్సులు జారీ చేస్తారు.

కాగా, మద్యం షాపుల టెండర్ అప్లికేషన్ కు విపరీతమైన స్పందన వస్తోంది. కేవలం 3 రోజుల్లో 2620 వైన్ షాపులకు ఏకంగా 2000కు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఎన్నికల ఏడాది కావడంతో వైన్ షాప్ లైసెన్స్ లకు భారీ స్పందన వస్తోందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ , కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల నుంచి ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. ఈ నెల 18తో అప్లికేషన్ గడువు ముగుస్తుండటంతో దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాగా, ఈసారి అప్లికేషన్ ఫీజును రూ. 2లక్షలు చేశారు.

Updated : 8 Aug 2023 3:17 AM GMT
Tags:    
Next Story
Share it
Top