Group 2 exams: గ్రూప్-2 పరీక్ష మరోసారి వాయిదా..?
X
తెలంగాణలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. మరోసారి పరీక్ష వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టీఎస్పీఎస్సీ షెడ్యూల్ ప్రకారం జనవరి 6, 7వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఇంకా 11 రోజులే ఉన్నప్పటికీ.. టీఎస్పీఎస్సీ ఇంకా ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. ఇటీవల టీఎస్పీఎస్సీ ఛైర్మన్ సహా పలువురు సభ్యులు రాజీనామా చేశారు. వారి స్థానంలో ప్రభుత్వం ఇంకా కొత్త వారిని నియమించలేదు. గతంలో క్వశ్చన్ పేపర్లు లీక్ కావడం.. వరుసగా పరీక్షలు పోస్ట్ పోన్ అవ్వడంతో.. టీఎస్పీఎస్సీ బోర్డుపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి సమీక్ష నిర్వహించారు. దీంతో గత ప్రభుత్వ హయాంలో వేసిన నోటిఫికేషన్ ను రీ షెడ్యూల్ చేస్తారా? మరిన్ని పోస్టులను చేర్చి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా 783 పోస్టులతో విడుదలైన ఈ నోటిఫికేషన్కు 5.50 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనేదానిపై క్లారిటీ లేక అయోమయానికి గురవుతున్నారు.