Home > తెలంగాణ > కొవిన్ పోర్టల్ నుంచి కేటీఆర్ డేటా లీక్.. సెన్సిటివ్ వివరాలు టెలిగ్రామ్లో..!

కొవిన్ పోర్టల్ నుంచి కేటీఆర్ డేటా లీక్.. సెన్సిటివ్ వివరాలు టెలిగ్రామ్లో..!

కొవిన్ పోర్టల్ నుంచి కేటీఆర్ డేటా లీక్.. సెన్సిటివ్ వివరాలు టెలిగ్రామ్లో..!
X

కొవిన్ పోర్టల్ నుంచి డేటా లీక్ అయిందంటూ.. ప్రజల వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతిలో పడ్డాయంటూ.. టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. ఆ ఆరోపనలను ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత చిదంబరం సైతం మద్దతిచ్చారు. టెలిగ్రామ్, ట్రూ కాలర్ లో పౌరుల వ్యక్తిగత సమాచారం దొరుకుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిన్ పోర్టల్ నుంచి అడ్రస్, పుట్టిన తేదీలాంటి వ్యక్తిగత వివరాలు బట్టబయలు అయ్యాయని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. డేటా లీక్ అయిన బాధితుల్లో కేటీఆర్, కనిమొళి, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్ లాంటి తదితర ప్రముఖులు కూడా ఉన్నారు. ఫోన్ నంబర్లు, వ్యక్తుల పేర్లు, ఆధార్, పాస్ పోర్ట్ వివరాలన్నీ టెలిగ్రామ్ లో ప్రత్యక్షమయ్యాయి.

ఆ వార్తల్లో నిజం లేదు:

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. సాకేత్ గోఖలే ఆరోపనల్ని కొట్టి పారేసింది. కొవిన్ యాప్.. అడ్రస్, పుట్టిన తేదీలాంటి వంటి వివరాలను సేకరించదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రముఖుల వ్యక్తిగత సమాచారం లీకైందన్న ఆందోళనల నడుమ కేంద్రం స్పందించింది. కొవిన్ యాప్ ద్వారా కేవలం ఎన్ని డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నామనే సమాచారం మాత్రమే తెలుస్తుందని వెల్లడించింది. అయితే టెలిగ్రామ్ లో వస్తున్న సమాచారం గురించి.. కేంద్ర హోం శాఖ పనిచేస్తుందని.. ప్రస్తుతం ఈ సమాచారాన్ని పరిశీలిస్తోందని తెలిపింది.










Updated : 12 Jun 2023 12:34 PM GMT
Tags:    
Next Story
Share it
Top