కొమరం భీమ్ వర్ధంతి ఉత్సవాల్లో అపశృతి.. యువకులు మృతి
X
కొమరం భీమ్ వర్ధంతి ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. కొమురం భీం జెండాను ఎత్తే సమయంలో అక్కడే ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లకు జెండా ఇనుప పైపు తగిలి ఇద్దరు యువకులు మృతి చెందారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మండలంలోని చిన్న బెల్లాల్ గ్రామంలో కొమరం భీమ్ ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో కొమురం భీమ్ జెండాను ఎత్తే సమయంలో విద్యుత్ వైర్లకు జెండా కట్టిన పైపు కరెంట్ వైర్లకు తగలింది. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరికి స్వల్ప గాయాలు అయ్యాయి.
వెంటనే క్షతగాత్రులను ఖానాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా పేంద్రం మోహన్ (26) మార్గం మధ్యలో మృతిచెందగా మరొకరు అత్రం భీమ్ రావు(25) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మృతి చెందాడు. మరొక వ్యక్తి వెంకు పటేల్ పరిస్థితి ఆందోళన కరంగా మారడంతో అతనిని వైద్య చికిత్స నిమిత్తం ఖాన్ నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆదివాసీ గిరిజన యువకుల మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషా ద చాయలుముకున్నాయి.