Home > తెలంగాణ > Sridhar Babu : మేడిగడ్డ బ్యారెజీలో భారీ అవినీతి జరిగింది..మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu : మేడిగడ్డ బ్యారెజీలో భారీ అవినీతి జరిగింది..మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu  : మేడిగడ్డ బ్యారెజీలో భారీ అవినీతి జరిగింది..మంత్రి శ్రీధర్ బాబు
X

అసలు వాస్తవాలు ప్రజల ముందు ఉంచేందుకే మేడిగడ్డ పర్యటన అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. గత ప్రభుత్వ పాలనలో మేడిగడ్డ బ్యారెజీలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. శిథిలావస్థకు చేరుకున్న బ్యారెజీకి అసలు కారణలేంటని విజిలెన్స్ కి అందించినట్లు తెలిపారు. ఆ రిపోర్టులో అనేక అంశాలపై చర్చించేందుకే మేడిగడ్డ వెళ్తున్నామని చెప్పారు. వాస్తవాలు కళ్లారా చూసేందుకు బీఆర్ఎస్ ను కూడా రావాలని కోరుతున్నట్లు చెప్పారు. ఒక్క బీఆర్ఎస్ నే కాక సభ్యులందరినీ ప్రభుత్వం ఆహ్వానిస్తోన్నట్లు తెలిపారు. అన్నీ పార్టీల నేతలు మేడిగడ్డకు రావాలి ఆహ్వానించారు.

ఎలక్షన్ సందర్భంలొ డ్యామ్ కు సంబంధించి అనేక తప్పిదాలు ఉన్నాయని కేంద్రం నుంచి వచ్చిన డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించిన డ్యామ్ లకు ఇంతవరకు ఏమి కాలేదు..అన్ని పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. ఆనాడు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వలన ఇష్టా రాజ్యంగా, అడ్డగోలుగా నిర్మాణం జరిగిందని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయాల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు.

సుందిళ్ల బ్యారెజీ నిర్మాణానికి ఆ ప్రాంత రైతులు భూములు కొల్పోయి...రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగం చేసినప్పటికీ వారికి ఫలితం లేకుండా పోయిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.


Updated : 13 Feb 2024 11:05 AM IST
Tags:    
Next Story
Share it
Top