Cheyutha Scheme:తెలంగాణలో ఆరోగ్య శ్రీ.. కొత్తగా వచ్చిన మార్పులివే
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియను మొదలుపెట్టింది. ఆరింటిలో.. మొదటగా రెండింటిని శనివారం అమలు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఆరోగ్యశ్రీ పథకం కాగా.. మరోకొటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం. మహాలక్ష్మి పేరుతో నిన్న ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణంతో.. రాష్ట్ర మహిళలు ఎంతో సంబరపడుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక ఆరోగ్య శ్రీ విషయానికొస్తే.. గతంలోనే ఉన్న ఆరోగ్య శ్రీ స్కీమ్ కు... ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రారంభించిన స్కీమ్ కు తేడాలు ఉన్నాయి.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం:
- కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. అందులో ఒకటి చేయూత. దీనిలోని అంశమే రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా స్కీమ్.
- బీపీఎల్(below poverty line) కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం ఈ పథకం లక్ష్యం.
- తెలంగాణ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు బీపీఎల్ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
- గతంలో రూ. 5 లక్షల వరకే ఆరోగ్య బీమా ఉండగా... ప్రస్తుతం ఇది రూ. 10 లక్షలకు(ఏడాదికి) పెరిగింది.
- ఈ స్కీమ్ లో భాగంగా 1672 వైద్య సేవలు కవర్ అవుతాయి.
- ప్రస్తుతం తెలంగాణలో 77 లక్షల 19 వేల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి.
-రాష్ట్రవ్యాప్తంగా 1,310 ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ సేవలు
- 293 ప్రైవేట్ ఆస్పత్రులు, 198 ప్రభుత్వ ఆసుపత్రులు, 809 పీహెచ్‌సీలలో అందుబాటులో ఆరోగ్యశ్రీ సేవలు
- ఆరోగ్య శ్రీ కింద అందుబాటులో ఉన్న 1,376 ఆపరేషన్లు, 289 వైద్య సేవలు