Home > తెలంగాణ > Medaram : నేటి నుంచి స్కూళ్లకు సెలవు..ఈ జిల్లాల్లోనే..

Medaram : నేటి నుంచి స్కూళ్లకు సెలవు..ఈ జిల్లాల్లోనే..

Medaram : నేటి నుంచి స్కూళ్లకు సెలవు..ఈ జిల్లాల్లోనే..
X

మేడారం జాతర సందర్బంగా ఇవాళ అధికారులు సెలవు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకల స్కూళ్లు, కాలేజీలకు ఈ సెలవు వరిస్తుందని పేర్కొన్నారు.కాగా ములుగు జిల్లాలో 24 వరుకు సెలవులు ఉండనున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర, తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహా జాతర ప్రారంభం అయింది. వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు జనారణ్యంలోకి వచ్చి గద్దెలపై కొలువుదీరనున్నారు. ఈ నెల 24 వరకు నాలుగు రోజుల పాటు జాతర నిర్వహించనున్నారు. మంగళవారం మేడారం మహాజాతర జంపన్న గద్దెకు చేరే క్రతువుతో జాతర ప్రారంభమైంది. నిన్న సమ్మక్క కూతురైన సారలమ్మ గద్దెపై కొలువు దీరింది. సారలమ్మతో పాటు, పగిడిద్దరాజు, గోవిందరాజును గద్దెపైకి చేరుకుంటారు. సంప్రదాయబద్దంగా ఆదివాసి, గిరిజన పూజారులు ఈ అమ్మవారిని గద్దెలపైకి తొడ్కొని రానున్నారు.

ఇక ఫిబ్రవరి 22న చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి గద్దెపైకి రానుంది. ఫిబ్రవరి 23న గద్దెలపై కొలువుదీరని తల్లులకు పూజలు నిర్వహించనున్నారు. భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 24న దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ఉత్సవాలు ముగుస్తాయి. ఈ మహా జాతరకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. దాదాపు 2 కోట్ల మంది భక్తులు గద్దెలను దర్శించుకుంటారని అంచనా. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మహా జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి గద్దెలను దర్శించుకుంటారు. గవర్నర్‌ తమిళిసై సాందర రాజన్,ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వెళ్లనున్నారు.పోలీసు శాఖ బందోబస్తు కోసం 14 వేల మందిని రంగంలోకి దింపింది. భక్తుల భద్రత కోసం 700 వరకు సీసీ కెమెరాలతో నిఘాను కట్టుదిట్టం చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా.. రైల్వేశాఖ కూడా ప్రత్యేకంగా ట్రైన్లు నడుపుతోంది. హెలికాప్టర్‌లోనూ మేడారం వెళ్లేందుకు వీలు కల్పించారు. జాతరకు వచ్చే ప్రైవేటు వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు కేటాయించారు.

Updated : 22 Feb 2024 8:46 AM IST
Tags:    
Next Story
Share it
Top