SBI ATM : అర్థరాత్రి దొంగల బీభత్సం… ఏటీఏం నుంచి 30లక్షల అపహరణ…
X
మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం(Bayyaram)లో దొంగలు బీభత్సం సృష్టించారు. బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ వద్ద గల జాతీయ రహదారి పక్కన ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం( SBI ATM )లో శనివారం అర్ధరాత్రి దొంగలు(Thieves )చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం పగులగొట్టి 30 లక్షల రూపాయల నగదును అపహరించినట్లు తెలుస్తున్నది. బయ్యారం ఇల్లందు మెయిన్ రోడ్ లో ఒక ప్రైవేటు ఇంట్లో ఏటీఎం నిర్వహించడం దానిలో సీసీ కెమెరా లేకపోవడం. పలు అనుమానాలకు తావిస్తుంది. ఇది కావాలని ఎవరైనా చేశారా.. లేక దొంగల పనేనా..ఇంటి దొంగల పనేనా అనే విషయాలు తెలియాల్సి ఉంది.
ఉదయం ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చిన వారు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని సీఐ రవికుమార్, ఎస్ఐ ఉపేందర్ పరిశీలించారు. అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. బ్లాక్ కారులో వచ్చిన ఆరుగురు నిందితులు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి ప్రయత్నించినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మహబూబాబాద్ నుంచి వచ్చిన క్లూస్ టీం వేలిముద్రలతో పాటు ఆనవాళ్లను సేకరించారు. గత ఆరు నెలల క్రితం మండల కేంద్రంలోని ఎస్‌బీఐ బ్యాంకులో సైతం దొంగలు చోరీకి యత్నించగా పాల్పడ్డ వారిని 24 గంటలు వ్యవధిలోపే పోలీసులు గుర్తించారు.