Home > తెలంగాణ > అసెంబ్లీ ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలు సిద్ధం - సీఈఓ వికాస్ రాజ్

అసెంబ్లీ ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలు సిద్ధం - సీఈఓ వికాస్ రాజ్

అసెంబ్లీ ఎన్నికల కోసం 36వేల ఈవీఎంలు సిద్ధం - సీఈఓ వికాస్ రాజ్
X

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పోలింగ్‌ కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు.

తెలంగాణలో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉందని వికాస్ రాజ్ చెప్పారు. ఓటర్ల స్లిప్పుల పంపిణీ కూడా వేగంగా జరుగుతోందని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్న ఆయన.. రాష్ట్రంలో 36 వేల ఈవీఎంలను సిద్దం చేసినట్లు చెప్పారు. ప్రతి కౌంటింగ్‌ సెంటర్‌కు ఒక అ‍బ్జర్వర్‌ ఉంటారు. తెలంగాణలో ఎన్నికల కోసం 377 కంపెనీల కేంద్ర బలగాలు పనిచేస్తున్నాయని వికాస్ రాజ్ స్పష్టం చేశారు.

అభ్యర్థుల ఖర్చును పరిశీలించేందుకు 60 మంది అబ్జర్వర్లను నియమించామని వికాస్ రాజ్ చెప్పారు. ఈసారి కొత్తగా 51 లక్షల ఓటర్ కార్డులు ముద్రించి పంపిణీ చేసినట్లు ప్రకటించారు. సర్వీస్ ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారని స్పష్టం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో 18 నుంచి 19 ఏండ్ల మధ్య ఉన్న 9.9 లక్షల మంది కొత్త ఓటర్లు తొలిసారి ఓటు వేయనున్నారని సీఈఓ వికాస్ రాజ్ చెప్పారు.




Updated : 23 Nov 2023 5:30 PM IST
Tags:    
Next Story
Share it
Top