Telangana :2023లో తొలి మరణం..ఉస్మానియాలో కోవిడ్ రోగి మృతి
X
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహ్మమారి తెలంగాణలో మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా తెలంగాణలో ఈ ఏడాది తొలి కరోనా మరణం నమోదైంది. హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో అనారోగ్యంతో అడ్మిట్ అయిన ఓ వ్యక్తి.. చికిత్స పొందుతూ మరణించాడు. చలి జ్వరంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు వైద్యులు గుర్తించారు. కరోనా చికిత్స అందిస్తుండగానే కన్నుమూశాడని డాక్టర్లు చెప్పారు. ఇదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న మరో ఇద్దరు జూనియర్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ గా తేలింది.
రాష్ట్రంలో కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 293 మంది రోగులు కోలుకోగా.. కర్ణాటకలో ముగ్గురు మరణించారు. ప్రస్తుతం దేశంలో 4170 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ లోనే మొత్తం 45 కేసులు నమోదయ్యాయి