Home > తెలంగాణ > శంషాబాద్లో జీ20 ప్రత్యేక సదస్సు.. మూడ్రోజుల పాటు..

శంషాబాద్లో జీ20 ప్రత్యేక సదస్సు.. మూడ్రోజుల పాటు..

శంషాబాద్లో జీ20 ప్రత్యేక సదస్సు.. మూడ్రోజుల పాటు..
X

ఈ నెల 9, 10న ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఇందులో భాగంగా శంషాబాద్ నోవాటెల్ హోటల్లో వ్యవసాయంపై నిర్వహిస్తున్న ప్రత్యేక సదస్సు ప్రారంభమైంది. వాతావరణ ప్రతికూలతలను తట్టుకోగల వ్యవసాయం ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో కేంద్రమంత్రి శోభా కరంద్లాజే సహా 100 మంది దేశ, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు.





ఈ సదస్సులో వ్యవసాయ పరిశోధనలు, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకోగల వ్యవసాయ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.





జీ20 దేశాల వార్షిక సదస్సుకు ఈ ఏడాది భారత్ అతిధ్యమిస్తోంది. న్యూఢిల్లీలో జరిగే ఈ సదస్సుకు జీ20 దేశాల అధినేతలు హాజరవుతారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ సదస్సుకు హాజరుకావడం లేదు. ఇక అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఈ నెల 8నే భారత్ చేరుకోనున్నారు. ఆయన ప్రధాని మోడీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. దేశాధినేతలు వస్తుండడంతో కేంద్రం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.


Updated : 4 Sep 2023 8:33 AM GMT
Tags:    
Next Story
Share it
Top