Home > తెలంగాణ > బీజేఎల్పీ పదవికి తీవ్ర పోటీ.. రేసులో ఆ ముగ్గురు..

బీజేఎల్పీ పదవికి తీవ్ర పోటీ.. రేసులో ఆ ముగ్గురు..

బీజేఎల్పీ పదవికి తీవ్ర పోటీ.. రేసులో ఆ ముగ్గురు..
X

బీజేపీ శాసన సభాపక్ష నేత పదవి కోసం ఆ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే శాసనసభాపక్ష నేత రేసులో ముఖ్యంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ 8 మంది ఎమ్మెల్యేల్లో ఆరుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టినవారే. రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిలకు మాత్రమే గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. గతంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించడంతో ఆ పదవి తనకే దక్కుతుందని ఆశపెట్టుకున్నారు. నిజానికి బీజేపీ ఎమ్మెల్యేలందరిలో రాజాసింగ్ సీనియర్. అయితే ఆయనకు తెలుగుపై అంతగా పట్టు లేకపోవడం, హిందుత్వంపై తప్ప ఇతర అంశాలపై మాట్లాడకపోవడం మైనస్గా మారింది. ఆ కారణంతోనే మరొకరికి అవకాశమివ్వాలని పార్టీ హైకమాండ్ భావించవచ్చని బీజేపీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

రాజాసింగ్ను బీజేపీఎల్పీ లీడర్గా ఎన్నుకుంటే మరో ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. హైదరాబాద్కు చెందిన నేతలకే అన్ని పదవులన్న అపవాదు మూటగట్టుకునే ఛాన్సుంది. నగరానికి చెందిన కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా, బీజేపీ స్టేట్ చీఫ్గా ఉన్నారు. మరో సీనియర్ నేత లక్ష్మణ్కు బీజేపీ నేషనల్ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ పదవితో పాటు రాజ్యసభ పదవి దక్కింది. దీంతో సభాపక్ష నేత పదవి వేరే జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు ఇచ్చే ఆలోచన బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుస నడుస్తోంది.

ఇక ఏలేటి మహేశ్వర రెడ్డి విషయానికొస్తే నిర్మల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నుకయ్యారు. ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ను వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన మహేశ్వర రెడ్డి ఎల్పీ లీడర్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి నలుగురు ఎమ్మెల్యేలు విజయం సాధించడంతో తమ జిల్లాకే సభాపక్ష నేత పదవి ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం.

ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. వారిలో ఒకరు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి. మాజీ సీఎం కేసీఆర్.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి జెయింట్ కిల్లర్గా నిలిచారు. ఈయన కూడా ఎల్పీ లీడర్ రేసులో ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ హైకమాండ్ ఈ ముగ్గురిలో ఎవరికి అవకాశమిస్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది. సభాపక్ష నేతగా ఎవరని నియమిస్తారన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.



Updated : 21 Dec 2023 3:32 PM GMT
Tags:    
Next Story
Share it
Top