Home > తెలంగాణ > బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ముగ్గురు యువకుల పరిస్థితి విషమం..

బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ముగ్గురు యువకుల పరిస్థితి విషమం..

బంజారాహిల్స్లో కారు బీభత్సం.. ముగ్గురు యువకుల పరిస్థితి విషమం..
X

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ముగ్గురు యువకుల ప్రాణాల మీదకు తెచ్చింది. బుధవారం తెల్లవారుజామున బంజారాహిల్స్ లోని స్టడీ సర్కిల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు.

కారు ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును సీజ్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్థారించారు.

Updated : 14 Jun 2023 8:03 AM IST
Tags:    
Next Story
Share it
Top