ఖమ్మంలో బీఆర్ఎస్ తనని తాను చంపుకుంది : తుమ్మల
Krishna | 4 Nov 2023 4:59 PM IST
X
X
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు 25సీట్లకు మించి రావని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లాలో తాను, పొంగులేటి బీఆర్ఎస్ను బతికించామని.. కానీ ఆ పార్టీ తనను తాను చంపుకుందని ఆరోపించారు. పాలేరు, ఖమ్మం వేరు కాదన్న తుమ్మల.. తాను, పొంగులేటి కూడా వేరు కాదన్నారు. పాలేరులో పొంగులేటికి మద్ధతుగా తుమ్మల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలు తమ భవిష్యత్తు బాగు కోసం పొంగులేటిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు ఏ కష్టం వచ్చినా పొంగులేటి అండగా ఉంటారని తుమ్మల అన్నారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు కష్టపడి చేస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందన్నారు. ఖమ్మం జిల్లాలో డబ్బు ఒక్కటే రాజకీయం చేయదని.. కేసీఆర్ అహంకారానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని విమర్శించారు.
Updated : 4 Nov 2023 4:59 PM IST
Tags: thummala nageswara rao thummala ponguleti srinivas reddy khammam politics khammam congress khammam brs paleru palair telangana congress brs cm kcr telangana elections telangana politics telangana news telangana updates
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire