జనబలం ముందు కేసీఆర్ డబ్బులు పనిచేయవు : తుమ్మల
X
తెలంగాణలో అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అధికార పార్టీ వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉందని.. కానీ జనబలం ముందు ఆ డబ్బులు పనిచేయవని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని కుప్పెనకుంట్లలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయసమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. తాను , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేర్వేరు కాదని.. ప్రజల కోసం తాను చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తున్నట్లు చెప్పారు.
సీతారామ ప్రాజెక్టు ఇస్తానంటేనే తాను బీఆర్ఎస్‌లో చేరానని తుమ్మల చెప్పారు. కానీ బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో తాన మంత్రిగా పనిచేశానని.. తనకు పదవులు అవసరం లేదన్నారు. ఈ పది రోజులు కార్యకర్తలు కాంగ్రెస్ను గెలిపించేందుకు కష్టపడాలని.. ప్రజల కోసం తాము కష్టపడతామన్నారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలుస్తుందని.. 9న ప్రభుత్వ ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సత్తుపల్లి అభ్యర్థి మట్టా రాగమయిని గెలిపించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. సొంతంగా ఖర్చు పెట్టి అభ్యర్థులను గెలిపించే ఓటర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం సత్తుపల్లి అని అన్నారు.