Home > తెలంగాణ > ముఖ్య నేతల చూపు కాంగ్రెస్ వైపు.. తుమ్మలతో సహా పార్టీలోకి..

ముఖ్య నేతల చూపు కాంగ్రెస్ వైపు.. తుమ్మలతో సహా పార్టీలోకి..

ముఖ్య నేతల చూపు కాంగ్రెస్ వైపు.. తుమ్మలతో సహా పార్టీలోకి..
X

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు రాని నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని వదిలిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ వేదికగా జరిగే కాంగ్రెస్ సభలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. తాజాగా హైదరాబాద్ లోని తుమ్మల నివాసంలో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కీలక అంశాలు చర్చించి తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈ సారి ఎన్నికల బరిలో నిలవాలనుకున్న తుమ్మలకు బీఆర్ఎస్కు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయం అయింది.





తుమ్మలతో పాటు పాలేరు నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలు, అనుచరులు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్న తుమ్మల.. పాలేరు నియోజకవర్గ టికెట్ ఆశించినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఖమ్మం నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. కాంగ్రెస్ ఆఫర్కు తుమ్మల ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. పాలేరు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఇప్పటికే పొంగులేటికి హామీ ఇచ్చింది. మరోవైపు ఖమ్మం నుంచి బీఆర్ఎస్ తరఫున మంత్రి పువ్వాడ అజయ్ మళ్లీ బరిలో దిగుతున్నారు. ఆయనను ఓడించేందుకు తుమ్మల నాగేశ్వర్ రావు లాంటి సీనియర్ నేతను బరిలో దింపడమే మంచిదని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.




Updated : 15 Sept 2023 3:44 PM IST
Tags:    
Next Story
Share it
Top