Home > తెలంగాణ > రేపు హైదరాబాద్లో పార్కులు బంద్.. ఎందుకంటే..?

రేపు హైదరాబాద్లో పార్కులు బంద్.. ఎందుకంటే..?

రేపు హైదరాబాద్లో పార్కులు బంద్.. ఎందుకంటే..?
X

గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పార్కులన్నింటినీ గురువారం రోజు మూసేస్తున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న అమరవీరుల స్మారక స్థూపాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పార్కులకు హెచ్ఎండీఏ హాలిడే ప్రకటించింది. పార్కులకు వచ్చే సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆధికారులు తెలిపారు.

లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ పార్క్ లను రేపు మూసేస్తారు. గురువారం ఉదయం నుంచి ఇది అమలవుతుంది. సెక్రటేరియట్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సిందిగా సూచించారు. ఈ మార్గంలో ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి.





Updated : 21 Jun 2023 10:09 PM IST
Tags:    
Next Story
Share it
Top