Home > తెలంగాణ > టార్గెట్ రాహుల్ గాంధీ..కర్టూన్‎తో బీజేపీ కౌంటర్

టార్గెట్ రాహుల్ గాంధీ..కర్టూన్‎తో బీజేపీ కౌంటర్

టార్గెట్ రాహుల్ గాంధీ..కర్టూన్‎తో బీజేపీ కౌంటర్
X

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సోషల్ మీడియా వార్ హీటెక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీని టార్గెట్ చేసిన బీజేపీ ట్విటర్ వేదికగా వ్యంగ్య కార్టూన్‌ను విడుదల చేసింది. ఈ కార్టూన్‎లో ఎగురుతున్న వన్ సీటెడ్ విమానంలో రాహుల్ ఒక్కరే కూర్చున్నారు. బ్రాండ్ న్యూ(ఓల్డ్), హాట్ ఎయిర్ ఇండియా - టికెట్ టు డిజాస్టర్’ అనే క్యాప్షన్ తో ఈ కార్టూన్ ను పోస్ట్ చేశారు. పాత రాహుల్‎నే కొత్తగా చూపించేందుకు ట్రై చేస్తున్నారనే అర్థం వచ్చేలా కార్టూన్‎ను వేయించింది బీజేపీ .ప్రస్తుతం ఈ కార్టూన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





ఇండియా కూటమి తాజాగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా నిర్ణయించింది. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఈ విషయాన్ని ప్రకటించారు.

ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఉండేందుకు అన్ని పార్టీలు అంగీకరించినట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్‌ ఖర్గే కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‎పై విమర్శలు గుప్పించింది.




Updated : 28 Aug 2023 8:44 PM IST
Tags:    
Next Story
Share it
Top