Home > తెలంగాణ > ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. టైర్లు ఊడిపోవడంతో పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు

ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. టైర్లు ఊడిపోవడంతో పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు

ఫ్రీ బస్సు ఎఫెక్ట్.. టైర్లు ఊడిపోవడంతో పక్కకు ఒరిగిన ఆర్టీసీ బస్సు
X

ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. లోడ్ ఎక్కువ అవడంతో 80 మంది ప్రయాణిస్తున్న బస్సు రెండు టైర్లు ఊడిపోయిన ఘటన.. వరంగల్ జిల్లాలో జరిగింది. హన్మకొండ నుంచి హుజురాబాద్ వెళ్తున్న బస్సు.. రన్నింగ్ లో వెనక టైర్లు ఊడిపోయాయి. దాంతో ఒక పక్కకు ఒరిగి కొంత దూరం వెళ్లింది. ఎదురుగా ఏమీ రాకపోవడం, బస్సు స్పీడ్ తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. కాగా బస్సు ఒక్కసారిగా కిందకు ఒరిగే సరికి పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

55 మంది ప్రయాణించాల్సిన బస్సులో 80 మంది ప్రయాణించినట్లు తెలుస్తుంది. మహిళలకు ఫ్రీ బస్సు పథకం వల్ల దాదాపు అన్ని బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఈ బస్సులో కూడా 80 ప్రయాణించారు. ఎల్కతుర్తి శివారులో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో టైర్లు ఊడిపోయి పక్క పొలాల్లో పడిపోయాయి. దీంతో ప్రయాణికులంతా భయబ్రాంతులకు గురయ్యారు. టైర్లు ఊడిపోయిన విషయాన్ని గమనించి అప్రమత్తమైన బస్ డ్రైవర్.. బస్సును నెమ్మదిగా పోనిచ్చి పక్కకు ఆపాడు. బస్ ఒక పక్కకు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై మరొకరు పడ్డారు.

Updated : 24 Dec 2023 10:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top