Home > తెలంగాణ > నేడు, రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు

నేడు, రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు

నేడు, రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు
X

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో శుక్రవారం రాత్రి నుంచి జల్లులు కురుస్తున్నాయి. నేడు, రేపు..రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.

తెలంగాణలో వర్షాలు జులై చివరి వారంలో వర్షాలు దంచికొట్టాయి. జులైలో గట్టిగా కొట్టిన వానలు.. అగస్ట్లో అడ్రస్ లేకుండా పోయాయి. వానలు కురిసి దాదాపు 15 రోజులు అవుతుంది.

గత నెలలో పడిన వర్షాలకు ప్రాజెక్టులు సహా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు చోట్ల గ్రామాలే నీటమునిగి.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నెలలో వర్షాలు సరిగ్గా లేకపోవడంతో అటు అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. నేడు, రేపు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయని తెలిపింది. అదిలాబాద్, నిర్మల్, ఆసీఫాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలకు అవకాశం ఉందని తెలంగాణ వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

హైదరాబాద్ సహా మిగితాచోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దీంతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. జులైలో 23శాతం అధిక వర్షపాతం నమోదు కాగా.. ఆగస్టులో మాత్రం 82శాతం వర్షపాతం లోటు ఉన్నట్లు వాతావరణశాఖ చెబుతోంది. కాగా ఇప్పటికే పలుచోట్ల వర్షం పడుతోంది. అటు వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రత్తమైంది. సీఎస్‌ శాంతికుమారి టెలికాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో మాట్లాడారు, . కలెక్టరేట్లలో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు.



Updated : 19 Aug 2023 8:12 AM IST
Tags:    
Next Story
Share it
Top