Home > తెలంగాణ > CM KCR Election Campaign: నేటి కేసీఆర్ సభపై చర్చ.. ఏం మాట్లాడతారని సర్వత్రా ఆసక్తి

CM KCR Election Campaign: నేటి కేసీఆర్ సభపై చర్చ.. ఏం మాట్లాడతారని సర్వత్రా ఆసక్తి

CM KCR Election Campaign: నేటి కేసీఆర్ సభపై చర్చ.. ఏం మాట్లాడతారని సర్వత్రా ఆసక్తి
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. హుజూర్ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌ ద్వారా మొదట హుజూర్ నగర్ సభా ప్రాంగణానికి చేరుకుని సభ ప్రారంభిస్తారు. తర్వాత మిర్యాలగూడ, దేవరకొండ సభల్లో పాల్గొంటారు. వరుసగా ఒకే రోజు మూడు బహిరంగ సభల్లో కేసీఆర్‌ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్రకుమార్, మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు

ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సభా ప్రాంగణంలోనే ప్రత్యేకంగా హెలీప్యాడ్‌ ఏర్పాటు చేశారు. సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నియోజకవర్గాల నలుమూలల నుంచి పార్టీ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలను సైతం తరలించేందుకు వాహనాలు సమకూర్చుతున్నారు. ఈ సభల్లో కేసీఆర్‌ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నియోజకవర్గాల్లో చేపట్టే అభివృద్ధి పనులపై స్పష్టమైన హామీలు ఇచ్చే అవకాశముంది. కాగా నిన్న దుబ్బకలో ఎమ్మెల్యే అభ్యర్థి కొంత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యయత్నంపై కేసీఆర్ మాట్లాడే అవకాశం ఉంది. ఈ ఘటనపై పార్టీ తీసుకునే చర్యపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Updated : 31 Oct 2023 8:41 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top