Medaram : గద్దెలపైకి చేరుకున్న సమ్మక్క...నేడు మేడారానికి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళి సై
X
తెలంగాణలో అంగరంగ వైభవంగా మేడారం మహాజాతర కొనసాగుతోంది. ఆసియాలో జరిగే అతి పెద్ద గిరిజన జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తకోటి పోటెత్తుతున్నారు. మహాజాతరలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. భక్తజనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చేస్తున్న తమ ఇలవేల్పు సమ్మక్క గద్దెపై కొలువుదీరడంతో మేడారం పులకించిపోయింది. చిలకలగుట్ట మీద నుంచి కుంకుమ భరిణె రూపంలో తల్లిని తీసుకువచ్చారు ఆదివాసీ పూజారులు. ఇప్పటికే సారలమ్మ సహా వనదేవతలంతా కొలువుదీరి ఉండడం, సమ్మక్క కూడా గద్దెపైకి చేరడంతో జాతరకు నిండుతనం వచ్చింది.
ఇవాళ జాతరలో కీలక ఘట్టం. వనదేవతలంతా గద్దెలపై కోలువుదీరి భక్తులకు దర్శమిస్తున్నారు. భక్తజనం అశేషంగా తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే నేడు మేడారానికి గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు గవర్నర్, మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గద్దెలపై ఉన్న అమ్మవార్లను దర్శించుకొనున్నారు. వనదేవతలకు ప్రత్యేక పూజాలు చేసి మొక్కులు చెల్లించుకొనున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రి అర్జున్‌ముండా కూడా సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకొనున్నారు. పలువురు ముఖ్యులు అమ్మవార్ల దర్శనానికి వస్తుడడంతో భద్రతను కట్టదిట్టం చేశారు పోలీసులు. మేడారం మహాజాతర ఏర్పాట్లను మంత్రి సీతక్క దగ్గరుండి పరిశీలిస్తున్నారు.