Home > తెలంగాణ > బంగారం నేల చూపులు.. వెండి ధర కూడా మటాష్...

బంగారం నేల చూపులు.. వెండి ధర కూడా మటాష్...

బంగారం నేల చూపులు.. వెండి ధర కూడా మటాష్...
X

బంగారం ధర జోరు తగ్గింది. మార్కెట్లు పుంజుకుని మదుపర్లు బంగారానికి బదులు షేర్లపై మొగ్గుచూపుతుండడంతో పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వారం రోజులుగా ధరలు అంతకంతకూ తగ్గుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత ఒక వారంలో తొలిసారి గరిష్ట పతనం నమోదైంది. వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 14 కేరట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 430 తగ్గి రూ. 59,020కి చేరింది. 22 కేరట్ల బంగార ధర రూ. 400 తగ్గి రూ. 54,100కు పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 75 వేల నుంచి రూ. 1000 తగ్గి రూ. 74 వేల వద్ద నిలిచింది.

అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు, ఇంగ్లండు బ్యాంకులు బేసిస్ రేట్లను 50 పాయింట్లు పెంచుతుంటున్నట్లు ప్రకటించడంతో పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వడ్డీ, బ్యాండ్లపై రాబడి పెరిగే అవకాశం ఉండడంతో మదుపర్లు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదు. దీంతో గత మూడు నెలలు బులియన్ మార్కెట్ నేల చూపులు చూస్తోంది. పండుగలు, శుభకార్యాలు కూడా లేకపోవడంతో జనం నగల జోలికి వెళ్లడం లేదు.

Updated : 23 Jun 2023 4:12 PM IST
Tags:    
Next Story
Share it
Top