Home > తెలంగాణ > భారీగా పడుతున్న బంగారం ధరలు.. వెండి ఢమాల్

భారీగా పడుతున్న బంగారం ధరలు.. వెండి ఢమాల్

భారీగా పడుతున్న బంగారం ధరలు.. వెండి ఢమాల్
X

రాకెట్ వేగంతో దూసుకెళ్లిన బంగారం ధరలు అంతే వేగంగా పడిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిణమాలు, దేశీయంగా డిమాండ్ తగ్గడంతో పసిడితోపాటు వెండి ధరలు కూడా భారీగా దిగొస్తున్నారు. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 కేరట్ల బంగారం 10 గ్రాములకు రూ. 550 తగ్గి రూ. 57,150 చేరుకుంది. 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 600 తగ్గి రూ. 62,350 వద్ద నిలిచింది. బంగారం గత ఐదు రోజులకు కలిపి దాదాపు రూ. 2 వేలు దిగొచ్చింది. ఎంసీఎక్స్‌లో ఔన్స్ బంగారం ధర 2,028 డాలర్లకు చేరుకుంది.

ఇక వారం కిందటే కేజీకి రూ. 83 వేలపైగా చేరుకుని రికార్డ్ సృష్టించిన వెండి ధర శనివారం భారీగా పతనమైంది. హైదరాబాద్‌లో రూ. 2 వేలు తగ్గి రూ. 80 వేలకు చేరుకుంది. గత వారం రోజుల్లో రూ. 4 వేలకుపైగా తగ్గుదల నమోదైంది.

Updated : 9 Dec 2023 3:27 PM IST
Tags:    
Next Story
Share it
Top