Home > తెలంగాణ > మళ్లీ తగ్గిన బంగారం.. మరింత తగ్గే చాన్స్..

మళ్లీ తగ్గిన బంగారం.. మరింత తగ్గే చాన్స్..

మళ్లీ తగ్గిన బంగారం.. మరింత తగ్గే చాన్స్..
X

బంగారం ధర మళ్లీ తగ్గింది. షేర్ మార్కెట్లు జోరుగా సాగడంతో డిమాండ్ తగ్గి ధర రోజురోజుకూ దిగి వస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, మన దేశంలో డిమాండ్‌కు తగ్గట్లు మరికొన్నాళ్లు ధరలు కొంచెం కొంచెంగా దిగిరావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గురువారం హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 210 తగ్గి రూ. 58,750కి చేరింది. 22 కేరట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 53,850కి పడిపోయింది. కేజీ వెండి ధర రూ. 75,700 నుంచి రూ. 400 తగ్గి రూ. 75,300 వద్ద నిలిచింది.

షేర్ మార్కెట్లో రాబడి ఆశా జనకంగా ఉండడంతో మదుపర్లు బంగారానికి బదులు షేర్లపై మొగ్గుచూపుతున్నారు. దీంతో పక్షం రోజులుగా ధరలు తగ్గుతున్నాయి. గత నాలుగు నెలల కాలంలో ఇంత భారీగా తగ్గడం ఇదే తొలిసారి. అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు, ఇంగ్లండు బ్యాంకులు బేసిస్ రేట్లను 50 పాయింట్లు పెంచుతుంటున్నట్లు ప్రకటించడంతో పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. వడ్డీ, బ్యాండ్లపై రాబడి పెరిగే అవకాశం ఉండడంతో మదుపర్లు బంగారం కొనుగోళ్లపై ఆసక్తి చూపడం లేదు. దీంతో గత మూడు నెలలు బులియన్ మార్కెట్ నేల చూపులు చూస్తోంది. పండుగలు, శుభకార్యాలు కూడా లేకపోవడంతో జనం నగల జోలికి వెళ్లడం లేదు.

Updated : 29 Jun 2023 5:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top