Home > తెలంగాణ > CM Revath Reddy : నేడు కేసీఆర్ పుట్టినరోజు..విషెస్ తెలిపిన గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్

CM Revath Reddy : నేడు కేసీఆర్ పుట్టినరోజు..విషెస్ తెలిపిన గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్

CM Revath Reddy  : నేడు కేసీఆర్ పుట్టినరోజు..విషెస్ తెలిపిన గవర్నర్‌ తమిళిసై, సీఎం రేవంత్
X

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురాగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్ర పునర్ నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడిగా సభ సజావుగా నడిపించే విధంగా దేవుడు ఆయనకు శక్తి ఇవ్వాలని కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆమె కేసీఆర్‌కు ఒక లేఖను, పుష్పగుచ్ఛాన్ని పంపించారు. రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ స్వాప్నికుడు, స్వరాష్ట్ర సాధకుడు, ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ అని ఆయన కొనియాడారు. కారణజన్ముడు అయిన కేసీఆర్‌ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు. కేసీఆర్‌ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడని పొగిడారు. ఈ మేరకు ఎక్స్‌ (X) లో ఆయన ట్వీట్‌ చేశారు. దేశ వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. బహ్రెయిన్, ఖతార్ లో కూడా బర్త్ డే వేడుకలను అభిమానులు నిర్వహిస్తున్నారు. తన తండ్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.




Updated : 17 Feb 2024 12:52 PM IST
Tags:    
Next Story
Share it
Top