Home > తెలంగాణ > ఎన్నికల ప్రచారం: టాప్ గేర్ వేసిన కేసీఆర్.. నేడు కూడా 4 సభలు

ఎన్నికల ప్రచారం: టాప్ గేర్ వేసిన కేసీఆర్.. నేడు కూడా 4 సభలు

ఎన్నికల ప్రచారం: టాప్ గేర్ వేసిన కేసీఆర్.. నేడు కూడా 4 సభలు
X

గులాబీ దళపతి , ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ.. ఎన్నికల ప్రచారం చేస్తూ.. ప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇస్తున్నారు. ఇక.. రెండోవిడత ప్రచారంలో భాగంగా రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బుధవారం బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నియోకవర్గాల్లో పర్యటించారు కేసీఆర్.అక్కడి ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. ఈరోజు కూడా నాలుగు చోట్ల సీఎం కేసీఆర్ సభలు జరుగనున్నాయి. ఈరోజు ఆదిలాబాద్, బోథ్, నిజామాబాద్ రూరల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.

మొదటగా నర్సాపూర్‌ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ తర్వాత నిజామాబాద్ రూరల్ జిల్లా కేంద్రంలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక, అక్కడి నుంచి ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గ కేంద్రంలోని సభలో పాల్గొంటారు.. అయితే, ఈ మేరకు ప్రత్యేక హెలికాప్టర్‌ లో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించనున్నారు. దీంతో కేసీఆర్ పర్యటించే ప్రాంతాల్లో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, నిన్న కేసీఆర్ ప్రయాణించిన హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తింది.

Updated : 16 Nov 2023 11:10 AM IST
Tags:    
Next Story
Share it
Top