Home > తెలంగాణ > Otan Account Budget : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

Otan Account Budget : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం

Otan Account Budget   : ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం
X

(Otan Account Budget) ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ కమీటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం సుమారు 3లక్షల కోట్లు బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కు సభలో పద్దును ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసన మండలిలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ సమర్పించనున్నారు. కాగా, గత ఏడాది ప్రభుత్వం 2.90 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో ఈ సారి బడ్జెట్ 3 లక్షల కోట్లు దాటనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆరు గ్యారెంటీ స్కీమ్‌ల అమలుకు బడ్జెట్ కేటాయింపులపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టడంతో.. సెంట్రల్ నుండి రాష్ట్రానికి వచ్చే నిధులపై సరైన క్లారిటీ లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం తరహాలోనే ఓట్ ఆన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. గత ఏడాది అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్ రావు రూ. 2,90,396 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.







Updated : 10 Feb 2024 5:15 AM GMT
Tags:    
Next Story
Share it
Top